తరుణ్ పెళ్లి రూమర్స్ పై స్పందించిన రోజారమణి..!
తరుణ్ గురించి రూమర్స్ వస్తూనే ఉంటాయని, వాటిని ఎలా తీసుకుంటారు? అనే ప్రశ్నకి రోజా రమణి గారు ఇలా చెప్పారు. "రూమర్స్ అనే పదంలోనే ఉంది కదా.. నిజం కాదు అని. రూమర్స్ రూమర్స్ గానే వదిలేయాలి. సీరియస్ గా తీసుకోవద్దు, యాక్షన్ తీసుకోవద్దు, నవ్వుకుని వదిలేయాలి. చెప్పుకోనివ్వండి, మాట్లాడుకోనివ్వండి.. ఏం వస్తుంది అలా చేస్తే. మేం యంగ్ స్టర్స్ గా ఉన్నప్పుడు మ్యాగజైన్స్ వచ్చేవి. దాంట్లో రూమర్స్, గాసిప్స్కు ఒక కాలమ్ ఉండేది. స్టార్ డస్ట్ అని ఒకటి ఉండేది. దాంట్లో కేవలం రూమర్స్ మాత్రమే ఉండేవి. కాలేజి పిల్లలు తెగ చదివేవాళ్లు. చూడండి రూమర్స్ ఎంతబాగా చదువుతున్నారో అనేవాడు ఒక వ్యక్తి. ఎవరైతే ఫేమ్ గా ఉన్నారో, ఎవరిపైన రూమర్స్ రాస్తే చదువుతారో వాళ్ల మీదే రాస్తారు రూమర్స్" అని తమ కాలంలోనే ఇలాంటివి ఉండేవని చెప్పారు రోజా రమణి. "ఇక తరుణ్ విషయానికొస్తే.. సినిమాల్లో పెళ్లిలు కంటే బయట ఎక్కువ అవుతాయి కదా. దానికంటే వీళ్లే ఎక్కువ చేసేస్తారు. ఇప్పటికి ఎంతోమందితో పెళ్లి చేశారు. ఎవరిదో ఫొటో తీసుకుని, దానికి వేరే తలకాయ పెట్టడమో.. లేదంటే ముఖాలు బ్లర్ చేయడమో చేసి పెట్టేస్తుంటారు. ఇంక ఆ ఫొటో తాలూకు హీరోయిన్లు ఫోన్ చేసి ఆంటీ ఫొటో చూశారా? అంటూ చెప్తుంటారు. హీరోయిన్లు శ్రేయ, త్రిష, ప్రియమణి వాళ్లంతా చాలా క్లోజ్ గా ఉంటారు. అలా వాళ్లంతా ఫోన్ చేసి ఆట పట్టిస్తారు. చూశారా? మాకు పెళ్లి చేశారు అంటూ అంటుంటారు. పేరెంట్ గా పెళ్లి చేయడం నా బాధ్యత. కానీ, వాళ్లకు నచ్చిన అమ్మాయిన ఇచ్చి చేస్తాం. అది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? వాళ్ల చేతుల్లోనే ఉంది" అని తరుణ్ పెళ్లి గురించి చెప్పారు ఆమె. ఇక తరుణ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు. బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక హీరోగా కూడా హిట్ సినిమాలు తీశాడు.