రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ అంచనా వేస్తున్న నెటిజన్స్..!!

murali krishna
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కబోతున్న విషయం మనకు తెలిసిందే.. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలకు దారితీస్తుంది.ఇక మహేష్ బాబు మాత్రం వారానికి ఒక లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకుడిని అలరిస్తున్నాడు. అయితే తను మార్చుకున్న లుక్కు దేనికోసం అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే మహేష్ బాబు కోసం రాజమౌళి లుక్ టెస్ట్ చేసి మరి ఒక లుక్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఒక పిక్ మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక సింహాసనం మీద మహేష్ బాబు సిక్స్ ప్యాక్ బాడీ తో కూర్చున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఇది ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన ఫోటోనా? లేకపోతే ఫ్యాన్స్ కలిసి ఆ ఫోటోను అలా డిజైన్ చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక మొత్తానికైతే మహేష్ బాబు ఈ సినిమాలో ఇలాంటి ఒక బాడీతో చాలా స్టిఫ్ గా కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా విషయంలో మహేష్ బాబు ఇలానే కనిపించబోతున్నాడు అంటు కొంతమంది కామెంట్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రమే మహేష్ ఇలా కనిపించడు వేరే డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక మొత్తానికైతే జక్కన్న తన సినిమాలో మహేష్ ని ఎలా చూపించబోతున్నాడు అనేది ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే తప్ప తన క్యారెక్టర్ గురించి గానీ ఆయన స్టైల్ గురించి గానీ జనాలందరికి ఒక క్లారిటీ అయితే రాదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో రాజమౌళి పాన్ వరల్డ్ లో తన సత్తా చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికోసమే తను కష్టపడుతూ మహేష్ బాబును కూడా చాలా వరకు కష్టపెడుతున్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: