ప్రస్తుతం తెలుగు ,
తమిళ ,
హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న
రాశి ఖన్నా తాజాగా
తమిళ సినిమా అయినటువంటి "అరుణ్మనై 4" లో ప్రధాన పాత్రలో నటించింది.
సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో
తమన్నా కూడా ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ
మూవీ మే 3 వ తేదీన
తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ
సినిమా బాక్ అనే టైటిల్ తో విడుదల అయింది.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా పర్వాలేదు అనే టాక్ ను
బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ
మూవీ కి అటు
తమిళ్ , ఇటు తెలుగు ఇండస్ట్రీలలో పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ
సినిమా విడుదల అయిన సందర్భంగా ఈ
బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఓ సినిమాలోని పాత్ర చేయడం చాలా భయం వేసింది అని చెప్పుకొచ్చింది.
తాజాగా
రాశి కన్నా మాట్లాడుతూ ... నేను కొన్ని సంవత్సరాల క్రితం
సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన
ప్రతిరోజు పండగే అనే సినిమాలో
హీరోయిన్ గా నటించాను. ఆ సినిమాలో నేను ఏంజెల్ ఆర్నా అనే పాత్ర చేశాను. ఈ పాత్ర చేయడం నాకు చాలా భయం వేసింది. అలా ఈ పాత్ర చేస్తున్న మొదట్లో నాకు చాలా భయం వేసినప్పటికీ ఆ తర్వాత ఈ క్యారెక్టర్ ను చేయడం చాలెంజిగా పెట్టుకున్నాను.
అలా
సక్సెస్ ఫుల్ గా ఆ పాత్రను చేశాను. ఆ తర్వాత ఆ
మూవీ విడుదల అయ్యి మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా అందులోని నా పాత్రకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి అని ఈ
బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది. ఇకపోతే ప్రతిరోజు పండగ సినిమాలో రాసి
కన్నా తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ
మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఈ
మూవీ తర్వాత ఈ
బ్యూటీ కి తెలుగులో ఇప్పటివరకు విజయం దక్కలేదు.