చాలా సంవత్సరాల పాటు తమిళ మరియు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగించిన జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగు లో స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సరసన సినిమాలలో నటించింది. ఈమె చిరంజీవి తో నటించిన ఠాగూర్ మూవీ , నాగార్జున తో నటించిన మాస్ మూవీ లు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఈ రెండు మూవీ లతో ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది.
ఇకపోతే పర్వాలేదు అనే స్థాయిలో కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య ను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. కాకపోతే పెళ్లి తర్వాత ఈమె కమర్షియల్ సినిమాలలో కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. కాకపోతే కొన్ని రోజుల క్రితమే తమిళ నాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే.
వీటిలో జ్యోతిక తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. దానితో అనేక వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా వాటిపై జ్యోతిక వివరణ ఇచ్చింది. గత కొన్నలుగా ఓటు హక్కును నేను వినియోగించుకుంటున్నాను. కాకపోతే కొన్ని సార్లు అత్యవసరమైతే చెన్నై లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ సమయం లో నేను ఓటు వేసే అవకాశం కూడా ఉండదు. ఇక ఈ సారి నేను ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణం ఆ సమయంలో నేను అనారోగ్యంతో ఉన్నాను. అది నా వ్యక్తిగత విషయం. అందుకే నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేదు అని జ్యోతిక తాజాగా చెప్పుకొచ్చింది.