యంగ్
బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .’పెళ్ళి సందD’ సినిమాతో సినీరంగంలో కి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ సినిమాతోనే యూత్ లో భారీగా క్రేజ్ తెచ్చుకుంది.ఆ తరువాత రవితేజతో నటించిన ‘ధమాకా’
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది .ఆ
సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధించింది.ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ కు పిచ్చ క్రేజ్ వచ్చింది.ఆ
సినిమా సూపర్ హిట్టవ్వడంతో శ్రీలీల కు వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ శ్రీలీల కు కాలం కలిసి రాలేదు .ఆమె చేసిన వరుస సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి.గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్
కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో శ్రీలీలకి ఎదురు దెబ్బ తగిలింది. దీనితో శ్రీలీల కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది.అయితే ఈ ఏడాది ఆమె నటించిన గుంటూరు కారం
సినిమా మంచి
విజయ్ సాధించింది .కానీ ఈ సినిమాలో కూడా శ్రీలీల పాత్రకు స్కోప్ లేదు. దీంతో కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ తీసుకుని స్టడీస్‌పై ఫోకస్ చేయాలని ఫిక్సయ్యింది.టాలీవుడ్ లో ఈ భామకు ఆఫర్స్ కరువవడంతో ఇక ఈ భామకు ఆఫర్స్ రావని అంతా భావించారు. కానీ
కోలీవుడ్ నుంచి ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.
కోలీవుడ్ స్టార్ హీరోస్
విజయ్,
అజిత్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఇదిలా ఉంటే శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కార్తీ హీరోగా ప్రముఖ
బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఇందులో హీరోయిన్గా శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.