పుష్ప సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన బన్వర్ సింగ్ షేకావత్...!?

Anilkumar
మాలివూర్ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ శకావత్ పాత్రలో కరెక్ట్ గా సెట్ అయ్యాడు ఈ హీరో. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత హైలెట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పుష్ప సినిమాలో ఆ ఒక్కటి తగ్గింది అంటూ భారీగా క్రేజ్  సంపాదించుకున్నాడు. తాజాగా ఇప్పుడు పుష్ప టు లో కూడా సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక  ఈ హీరో నటించిన మరొక లేటెస్ట్ సినిమా ఆవేశం. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 150 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ క్రమంలోనే ఈటీవీలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా

 పుష్పా సినిమాపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పుష్పా నా కోసం ఏదో చేసిందని అనుకోవడం లేదు. ఈ విషయాన్ని దాసాల్సిన అవసరం కూడా నాకు లేదు. సుకుమార్ సార్ కి ఇదే చెప్పాను నేను నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. నాకు కావాల్సిన వాటిని బాలీవుడ్ సినిమాల్లో చేస్తున్నాను. నేను ఎవరిని ఆ గౌరవ పరచడం లేదు .పుష్ప తరువాత ప్రజలు నా నుండి మ్యాజిక్ ను ఆశిస్తున్నారు. లేదు... ఇది సుకుమార్ సార్ పట్ల ప్రేక్షకులు

 చూపించిన స్వచ్ఛమైన సహకారం ప్రేమ..నాకు సంబంధించిన విషయాలన్నీ చాలా స్పష్టంగా మలయాళ సినిమాలో ఉన్నాయంటూ.. తన మాతృభాషపై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. యాక్షన్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రోమాంచం ఫేం జీతూ మాధవన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆవేశం విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్‌ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఫహద్‌ ఫాసిల్ తమిళంలో మారీసన్‌, వెట్టయియాన్‌ చిత్రాల్లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పుష్ప వన్ లో చివరిలో ఆయన పాత్ర కొద్దిగానే ఉన్నప్పటికీ పుష్పాటూలో మాత్రం ఆయన పాత్ర చాలావరకు ఉంటుంది అని తెలుస్తోంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: