ఆనంది, వరలక్షీల "సివంగి".. డైరెక్టర్ అవుతున్న మరో టెక్నీషియన్?
సివంగి.. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ ఈ చిత్రంతో దర్శకునిగా కొత్త సినీ జీవితం ప్రారంభిస్తున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి ఈ సివంగి మూవీని నిర్మిస్తున్నారు.
ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి. ఓ మహిళా తన జీవితం లో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం. డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సివంగి మూవీ రూపొందింది. ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి తెలియజేశారు.
ఈ చిత్రానికి AH.కాసిఫ్ - ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు. భరణి దర్శకత్వంలో పాటు డీవోపీగా కూడా ఈ సివంగి మూవీకి పని చేస్తున్నారు. ఇంక0 సంజిత్ Mhd ఎడిటర్. ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే నిర్మాతలు తెలియజేయనున్నారు.
ఈ సివంగి సినిమా వివరాలు..
నటీనటులు : ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్, జాన్ విజయ్ మరియు డా.కోయ కిషోర్
ప్రొడక్షన్ హౌస్: ఫస్ట్ కాపీ మూవీస్
నిర్మాత: నరేష్ బాబు.పి
రచన, దర్శకత్వం : భరణి కె ధరన్
సంగీతం : AH.కాసిఫ్ - ఎబినేజర్ పాల్
డీవోపీ: భరణి కె ధరన్
ఎడిటర్: సంజిత్ Mhd
ఆర్ట్ : రఘు కులకర్ణి
పీఆర్వో: తేజస్వి సజ్జా