తనకు కాబోయే భర్తకి అదొక్కటి ఉంటే చాలు అంటున్న అనన్య నాగళ్ళ..!?

Anilkumar
టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. కాగా ఇప్పుడు తంత్రా అనే మరొక సినిమాలో హీరోయిన్గా నటించి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాతో కూడా మంచి టాక్ సంపాదించుకుంది. అయితే ఒకవైపు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇలా సినిమాలో చేస్తూనే మరొకవైపు సోషల్

 మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అన్న విషయాన్ని వెల్లడించింది. దీంతో ఆమె చేసిన పలు కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సాధారణంగా ఏ అమ్మాయి అయినా తనకు కాబోయే భర్త మంచి హైట్ వెయిట్ గ్లామరస్ గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. మరికొందరు అయితే బాగా రిచ్ గా ఉంటే చాలు అని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం మంచి ఉద్యోగం చేసేవాడు అయ్యి ఉండాలి అని

 కోరుకుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమకు రాబోయే శ్రీవారి గురించి కలలు కంటూ ఉంటారు. హీరోయిన్ అనన్య కూడా తనకు కాబోయే భర్తకు ఆ ఒక్కటి ఉంటే చాలు పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసింది. ఈ అమ్మడు పెళ్లి చేసుకునే వాడికి డిఫరెంట్ గా హీరోల్లాగా సిక్స్ ప్యాక్ లు, హెయిర్ స్టైల్స్ లు, కలర్ లు పెద్దగా ఉండాల్సిన పనిలేదట. గడ్డం బాగా ఉంటే చాలట.. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకునే వాడికి పుల్ గా బీయర్డ్ ఉండాలట. అంతే కాదు అందంగా మీసకట్టు కూడా ఉండాలిట. ఈ రెండు ఉంటే చాలు నేను ప్లాట్ అయిపోతానంటోంది బ్యూటీ.. ఇక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అవ్వాలని తెగ ప్రయత్నిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: