హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రణబీర్ కపూర్ చాలా రోజుల క్రితమే బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ కథానాయక అయినటువంటి దీపికా పదుకొనే ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎంతో కాలం పాటు ప్రేమించుకొని ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకొని ఆ తర్వాత పెద్దలను ఒప్పించుకొని వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత వీరి సంసార జీవితం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది. కొన్ని రోజుల క్రితమే దీపిక గర్భం దాల్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇలాంటి సమయం లోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకు ప్రధాన కారణం రన్బీర్ అనే చెప్పాలి. ఎందుకు అంటే ఈయన తన సోషల్ మీడియా అకౌంట్ లో చాలా రోజుల క్రితమే తమ పెళ్లికి సంబంధించిన ఎన్నో ఫోటోలను పోస్ట్ చేశాడు. ఇక తాజాగా వాటిని తన సోషల్ మీడియా అకౌంట్ నుండి ఈయన డిలీట్ చేశాడు. దానితో రన్వీర్ , దీపికా విడిపోబోతున్నారు. అందుకే తన సోషల్ మీడియా అకౌంట్ నుండి తన పెళ్లి ఫోటోలను రణ్వీర్ డిలీట్ చేశాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇక దీపిక కూడా తన పెళ్లికి సంబంధించిన అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. కానీ ఆమె మాత్రం తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ నుండి డిలీట్ చేయలేదు. దానితో పలువురు రన్వీర్ ఏదో అనుకోకుండా ఆ ఫోటోలను డిలీట్ చేసి ఉంటాడు. అంత మాత్రానికే వాళ్లు విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలను రాయడం మంచిది కాదు అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరు కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు.