ఒకప్పుడు సౌత్ ని ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. సుదీర్ఘకాలం ఈమె సౌత్ సినీ ఇండస్ట్రీలో హవా నడిపింది. దాదాపుగా రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు అందరి స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. చిరంజీవి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో కూడా జతకట్టింది. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో ఈమె కెరియర్ మలుపు తిరిగింది అని చెప్పొచ్చు. మగధీర సినిమా ఎంతటి
విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.ఇక ఆ సినిమాతో తన కెరియర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు కాజల్ .ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అయితే పెళ్లి తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న కాజల్ అగర్వాల్ తాజాగా ఒక టాక్ షోలో పాల్గొంది. ప్రముఖ కమిడియన్ ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో సరదాగా సీజన్ 2 షోకి వచ్చింది కాజల్ అగర్వాల్. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సినిమా సత్యభామ. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సంగతుల తో పాటు కాజల్ వ్యక్తిగత
వృత్తిపరమైన విషయాలను చాలా వరకు అభిమానులతో పంచుకుంది. కాజల్ కెరీర్లో ఒకే ఒక చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. ఈ ప్రస్తావన తెచ్చిన ఆలీ... జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఎవరు? హీరో, దర్శకుడు లేదా నిర్మాతనా? అని అడిగాడు. కేవలం ఎన్టీఆర్ వలనే ఐటెం సాంగ్ కి ఒప్పుకున్నానని కాజల్ చెప్పడం విశేషం. ఎన్టీఆర్ తో కాజల్ మూడు సినిమాల్లో నటించింది. బృందావనం, బాద్ షా, టెంపర్ చిత్రాల్లో జతకట్టారు. ఈ మూడు చిత్రాలు విజయం సాధించడం విశేషం. తరవాత మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా? అని అడగ్గా... గౌతమ్ కిచ్లు(కాజల్ భర్త) నాకు పదేళ్లుగా తెలుసు. లాక్ డౌన్ సమయంలో ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అప్పుడే మేము పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని, కాజల్ అన్నారు.