రూమర్స్ వల్ల అలాంటి అవమానాలు ఎదురయ్యాయని సంచలనవ్యాఖ్యలు చేసిన రవి..!!
మీరు పక్కా కమర్షియల్ అట కదా… అని రీతూ అడిగింది. అవును 100 శాతం నేను కమర్షియల్. ఎందుకంటే నాకు వచ్చిన పనిని డబ్బు తీసుకొని మాత్రమే చేస్తానని యాంకర్ రవి అన్నారు. నీకు పెళ్ళైన సంగతి ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది? అని రీతూ ప్రశ్నించింది. దీనికి రవి ఏం చెప్పాడు అన్నది ప్రోమోలో సస్పెన్స్ గా చూపించారు. ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఈ క్రమంలో లాస్యతో ఎఫైర్ రూమర్స్ వస్తున్న క్రమంలో… తన భార్యకు జరిగిన సంఘటన గురించి రవి బయటపెట్టాడు. రవి మాట్లాడుతూ … నా భార్యతో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళాను. అక్కడ కొందరు .. రవి భార్య ఆ యాంకర్ కదా నువ్వేంటి నా మొగుడు అంటూ చెప్పుకుని తిరుగుతున్నావు అంటూ నా భార్యని అడిగారట. దీంతో తను భరించలేక పోయింది. చాలా బాధ పడింది. ఏ భార్య అయినా తన భర్త ని మరొకరికి భర్త అంటే సహించలేదు. ఆ రూమర్స్ వల్ల దారుణమైన అవమానాలు ఎదురయ్యాయి అంటూ రవి చెప్పుకొచ్చాడు.