రెమ్యూనరేషన్ గురించి అడిగితే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఫహాద్ ఫాజిల్..!?

Anilkumar
పర్ఫెక్ట్ విలన్ అంటేనే హీరోకి ఉన్నన్ని క్వాలిటీస్ ఉంటాయి. అలా అని విలన్ అంటే అత్యంత బలవంతుడు కానవసరం లేదు. ఆ పాత్రను బాగా స్క్రీన్ పై ప్రదర్శించేవాడైతే చాలు. అయితే దీనికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే నటుడు బన్వర్సింగ్ శకావత్ సింగ్ శకావత్. ఈయన ఎవరా అని అనుకుంటున్నారా.. పుష్ప సినిమా చూసిన వారికి ఈయన బాగా తెలిసే ఉంటాడు. అదేనండి ఫహద్ ఫజిల్. అయితే పుష్ప సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అదరగొట్టేసాడు. ఇక ఈ సినిమా తర్వాత రెమ్యూనరేషన్ భారీగా తీసుకునే విలన్స్ లో ఈయన కూడా ఒకరిగా మారిపోయాడు అన్న టాక్ సోషల్ మీడియాలో ఎప్పటి నుండో

 నడుస్తోంది. అయితే తాజాగా ఇదే మాట ఆయన దగ్గర ప్రస్తానిస్తే ఆయన దిమ్మతిరిగే ఆన్సర్ చెప్పాడు. అయితే మలయాళం లో వివిధ సినిమాలో చేస్తూ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఈ నేపథ్యంలోనే తెలుగులో ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక అప్పటికే డబ్బింగ్ సినిమాలు ఓటీటీ లతో ఆయన తెలుగులో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఆయన భార్య నజ్రియా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. అందుకే ఆయనకి తెలుగులో ఫాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇక అసలు విషయానికొస్తే..

 అదేనండి రెమ్యూనరేషన్‌ గురించి మాట్లాడుకుంటే.. దేనికైనా డబ్బు ఒక కారణం. కానీ అదొక్కటే కాదు. చేసే పని ఏదైనా అది మనలో ఉత్సాహం నింపేలా ఉండాలి. భన్వర్‌సింగ్‌ పాత్రకు ఎవరు నప్పుతారో దర్శకుడు సుకుమార్‌కు తెలుసు. అందుకే నేను సినిమాలో ఉన్నాను. మేమంతా ఒక భారీ ఇండియన్‌ కమర్షియల్‌ సినిమా చేశాం. 'పుష్ప' సినిమా టీమ్‌తో కలిసి పనిచేయడం సంతోషాన్ని ఇస్తోంది అని చెప్పారు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విలన్‌ను అవుతానో, లేదో మాత్రం నాకు తెలియదు అని రెమ్యూనరేషన్‌ టాపిక్‌ గురించి మాట్లాడారు ఫహాద్‌ ఫాజిల్‌. ఇక కేవలం డబ్బు సంపాదించడానికే సినిమాలు చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చిన ఆయన.. 'కుంబలంగి నైట్స్‌', 'ట్రాన్స్‌' చిత్రాలతో చాలానే సంపాదించా అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: