తాతా మనవళ్లుగా తండ్రి కొడుకులు.. భారీ ప్లాన్ వేసిన బ్రహ్మానందం..!?

Anilkumar
ఎన్నో దశాబ్దాల నుండి సినిమాల్లో ఏకధాటిగా అలరిస్తున్న ఏకైక నవ్వు బ్రహ్మానందం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బ్రహ్మానందం వారసుడిగా సిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆయన కొడుకు రాజా గౌతమ్. అయితే ఈయన ఎప్పటినుండో సినిమాలు చేస్తున్నప్పటికీ చేసిన ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఆయన హీరోగా ఇంకా మంచి గుర్తింపు ను తెచ్చుకోలేదు రాజా గౌతమ్. తన తండ్రితో కలిసి ఒక స్పెషల్ ప్రాజెక్టు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిజజీవితంలో తండ్రి కొడుకులు ఆయన బ్రహ్మానందం రాజ్యాంగం ఇప్పుడు వెండితెరపై

 మాత్రం తాతా మనవడిగా సందడి చేయబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ బ్రహ్మానందం పేరుతో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం చేశారు. స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఆర్ వి ఎస్ నిఖిల్ దర్శకత్వంలో వస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ను ఒక వీడియో ద్వారా విడుదల చేశారు చిత్రబృందం. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనౌన్స్ మెంట్ వీడియోను తండ్రి కొడుకులు ఇద్దరూ వెన్నెల కిషోర్‌తో  కలసి వెరైటీగా చేయించారు.

తాత పాత్ర చేయమంటే బ్రహ్మీ వ్యతిరేకించడం, ఆ తర్వాత కాసేపటికి ఒప్పుకున్నాక జరిగే సరదా సంభాషణతో వీడియోను రూపొందించారు. ఇక పట్టణ, గ్రామీణ సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రతిబింబించేలా సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌ని డిజైన్‌ చేశారు. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుందట.ఇక సినిమాను ఈ ఏడాది డిసెంబరు 6న విడుదల చేస్తామని కూడా టీమ్‌ చెప్పేసింది. తన పేరు మీద సినిమా తీయడం అందులో బ్రహ్మానందమే నటిస్తుండటంతో ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది.  మరోవైపు ఏకంగా ఏడు నెలల ముందు విడుదల తేదీ చెప్పేయడం కూడా ఆసక్తి కలిగించే విషయమే. ఇక ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన బ్రహ్మానందం ఆ తర్వాత స్పీడ్‌ తగ్గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: