రామ్ చరణ్ 100 సార్లు చూసిన పవర్ స్టార్ సినిమా ఏంటో తెలుసా..?
నిజానికి చిరంజీవి సినిమాల్లో చాలా సినిమాలను ఆయన చాలాసార్లు చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాని ఇప్పటికి వంద సార్లు చూడడం అనేది నిజంగా గ్రేట్ విషయం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉండే ఒక టైప్ ఆఫ్ స్టోరీ గాని, ఆయన మేనరిజమ్స్ కానీ రామ్ చరణ్ కి అమితమైన ఇష్టమట. అందువల్లే ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండేవారట. ఇక ఇప్పుడు కూడా రామ్ చరణ్ నటిస్తున్నప్పుడు కొన్ని యాంగిల్స్ లో మనకు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది.ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చూస్తూ పెరిగాడు కాబట్టి కొన్ని షాట్స్ లో పవన్ కళ్యాణ్ ఎలాగైతే నటిస్తాడో చరణ్ యాక్టింగ్ కూడా అలాగే అనిపిస్తుంది… ఇకపోతే రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాను తొందర్లోనే రిలీజ్ చేసి అభిమానుల్లో ఒక నూతన ఉత్సాహన్ని నింపాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు.