కోలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరు అయినటువంటి
ధనుష్ ప్రస్తుతం రయాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
ధనుష్ హీరో గా నటిస్తూ ఉండడం మాత్రమే కాకుండా ఈ సినిమాకి స్వీయ దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ
మూవీ ని మొదట
జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమాని
జూన్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇప్పటికే ఈ
సినిమా నుండి మేకర్స్ ఒక పాటను కూడా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ
సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ
మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన
థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల
థియేటర్ హక్కులను కూడా తాజాగా అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఏషియన్
సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి సంస్థ వారు దక్కించుకున్నారు.
ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ
మూవీ విడుదలకు ఇంకా చాలా రోజులే మిగిలి ఉండడంతో ఇప్పటి నుండే ఏషియన్
సురేష్ సంస్థల వారు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఏషియన్
సురేష్ సంస్థ ఈ
సినిమా తెలుగు హక్కులను దక్కించుకోవడంతో ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయ్యే అవకాశం చాలా వరకు ఉంది.