రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి కన్నుమూత..విషాదం లో తెలుగు పరిశ్రమ..!!
ఆమె మరణంతో బుల్లితెర పై విషాద ఛాయలు నెలకొన్నాయి. కర్ణాటక లోని మాండ్య కు చెందిన పవిత్ర జయరామ్.. పెద్దగా చదువుకోలేదు. అయితే తనకుంటూ సొంత గుర్తింపు ఉండాలని తపన తనలో ఎప్పుడూ ఉండేదట. అలా మాండ్య నుంచి బెంగళూరు కు వచ్చి సొంతంగా ఎదగాలని చాలా ఉద్యోగాలు చేసిందట. అదే టైమ్ లో తన ఫ్రెండ్ సలహా మేరకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో చేరింది. ఆ తర్వాత సీరియల్స్ లో నటించాలని కోరికతో పలు ఆడిషన్స్ కు వెళ్లేదట. అలా జోకాలి అనే కన్నడ సీరియల్ లో హీరోకి చెల్లిలి పాత్ర చేసే చాన్స్ వచ్చిందట. ఆ తర్వాత కన్నడలో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు తర్వాత తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్ లో తొలి అవకాశం వచ్చిందట. అయితే అప్పుడు తెలుగు తనకు అస్సలు అర్థం కాలేదట. దాంతొ ఒక టైమ్ లో సీరియల్ మానేసి కన్నడ సీరియల్స్ లోకి వెళ్లిపోవాలనుకుందట. కానీ తనతో అప్పడు పనిచేసిన తోటీ నటీనటులు నచ్చ జెప్పి తెలుగు నేర్పించారట. అలా ఇప్పుడు తెలుగులో మంచిగా మాట్లాడుతున్నట్లు ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వూలో తెలిపింది. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. పవిత్ర జయరామ్ కు అతి చిన్న వయసులోనే పెళ్లయింది. ఆమెకు పెళ్లయ్యే టైమ్ కు తనకు కేవలం 16 ఏళ్లేనట. ఆ తర్వాత కట్టుకున్న భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తుంది. ప్రస్తుతం పవిత్ర జయరామ్ కు 22ఏళ్ల కొడుకు, 19 ఏళ్ల కూతురు ఉంది. వీరిద్దరి కష్టపడి సొంతగా పెంచింది. ఇలాంటి టైమ్ లో పవిత్ర జయరామ్ మరణించడం నిజంగా బుల్లితెరపై తీరని లోటు.