వైవిధ్య కథలను ఎంచుకునే హీరోగా సత్యదేవ్
టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించాడు. తాజాగా ఆయన హీరోగా వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించిన
సినిమా 'కృష్ణమ్మ'. ప్రమోషన్స్ తో ఆసక్తి పెంచిన ఈ
మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో ఆకట్టుకుంది.టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తాజా చిత్రం 'కృష్ణమ్మ'తో మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.
రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ చిత్రంగా 'కృష్ణమ్మ' మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రగ్డ్ పర్సనాలిటీ, రస్టిక్ యాక్షన్ సన్నివేశాలతో సత్యదేవ్ ఆడియెన్స్ మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి 'కృష్ణమ్మ' తొలి రోజునే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే తొలి 5 రోజుల్లో రూ. 5.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించటంతో సత్యదేవ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది 'కృష్ణమ్మ'. తొలి ఆట నుంచే ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి మంచి టాక్ సంపాదించుకున్న ఈ
మూవీ తన విజయయాత్రను కొనసాగించింది.
యాక్షన్ మూవీగా 'కృష్ణమ్మ'
మూవీ ఆడియెన్స్‌ను చక్కగా ఎంగేజ్ చేస్తూ థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇంత బాగా ఆడుతున్నా కూడా ఈ
సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బ్రేక్ ఈవెన్ అయ్యి
సక్సెస్ ఫుల్ గా
థియేటర్ లలో ఆడుతున్న ఈ
సినిమా ఇంత త్వరగా ఓటిటికి రావడం సత్యదేవ్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు. ప్రముఖ దర్శకుడు కొరటాల
శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై
కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.అర్చన అయ్యర్
హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లక్ష్మణ్ మీసాల,
కృష్ణ బురుగుల, అతీరా రాజ్, రఘు కుంచె కీలక పాత్రలు పోషించారు.వి.వి.గోపాలకృష్ణ సినిమాను డైరెక్ట్ చేశారు.
కాలభైరవ సినిమాకు సంగీతాన్ని, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీని అందించారు.ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను రిలీజ్ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు మైత్రీ
మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేశాయి.