ఎన్టీఆర్ - నీల్ మూవీకి క్రేజీ టైటిల్.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్?
దేవర అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ముగిసిన తర్వాత అటు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ మూవీపై కూడా అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే బాగుండు అని అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాగా ఎన్టీఆర్ = ప్రశాంత్ నీల్ కాంబో మూవీ గురించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ మూవీ కోసం ఒక పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఇక అక్టోబర్లో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందట. ఇక ఈ సినిమాను కూడా రెండు పార్ట్ లుగా తెరకెక్కించాలని ప్లాన్ వేశాడట డైరెక్టర్ ప్రశాంత్. కాగా ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అటు సలార్ 2 మూవీ తో బిజీగా ఉండగా. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ తో పాటు వార్ 2 సినిమా షూటింగ్ తో కూడా బిజీగా ఉన్నాడు. ఇవి ముగిసిన తర్వాతే డ్రాగన్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.