నందమూరి
బాలకృష్ణ ప్రస్తుతం
బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత సూర్య దేవర
నాగ వంశీ ఈ
మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఎన్ బీ కే 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఈ
మూవీ లో
ఊర్వశి రౌటేలా
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఇక
కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు , శ్రేయ
రెడ్డి ఈ
మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలకు సంబంధించి మేకర్స్ మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ
మూవీ యొక్క షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. ఇక ఈ
సినిమా షూటింగ్ ఫుల్
జోష్ లో జరుగుతున్న సమయం లోనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ ల షెడ్యూల్ విడుదల కావడంతో
బాలకృష్ణ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ప్రచారాలలో బిజీగా ఉన్నాడు. దానితో ఈ
సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఎలక్షన్ లు పూర్తి కావడంతో వచ్చే నెల మొదటి వారంలో రిజల్ట్ రానుంది.
రిజల్ట్ వచ్చాక వెంటనే ఈ
సినిమా యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్ లో మేకర్స్ ఇంటర్వెల్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఈ యాక్షన్ సన్నివేశం
బాలయ్య కెరియర్ లోనే హైలెట్ గా ఉండే విధంగా
డైరెక్టర్ డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేసి ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.