పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమా తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో మరొకసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా ఏంటో చూపించాలి అని ఈ సినిమాను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ సినిమాను అల్లు అర్జున్ తో తీయాలి అనే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆ సినిమా జెంటిల్మెన్ సినిమాకి సీక్వెల్ గా తీయాలి అని శంకర్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇకపోతే
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తరువాత శంకర్ కి డేట్స్ ఇస్తాడా లేదా అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇకపోతే పుష్పటు తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం చేశారు. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సైతం మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు శంకర్ తో సినిమా అంటే దాదాపుగా రెండు నుండి మూడు సంవత్సరాలు
కచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంది. మరి ఇంత బిజీ షెడ్యూల్లో శంకర్ తో అల్లు అర్జున్ సినిమా చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు
ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే శంకర్ అల్లు అర్జున్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులోనే వరుస సినిమాలో చేయడానికి కమిట్ అయ్యారు. తమిళంలో ప్రస్తుతం ఒక సినిమా కూడా చేయడం లేదు. ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చెంజర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాటు లోక నాయకుడు కమలహాసన్ తో ఇండియన్ టు సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి..!!