హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న లేటెస్ట్ యంగ్ హీరోస్ వీళ్లే..!?
తేజ సజ్జ
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజ. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి గాను 25 కోట్ల నుండి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట తేజ. హనుమాన్ సినిమా తర్వాత మిరాయి అనే సినిమా చేస్తున్నాడు.
విశ్వక్ సేన్
టాలీవుడ్ లో మాస్ కా దాస్ విశ్వక్సేన్ గా పేరు తెచ్చుకున్న ఈయన గామి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి గాను 20 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం వినబడుతోంది .
సిద్ధూ జొన్నలగడ్డ
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు ఈ యంగ్ హీరో. టిల్లు సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకి గాను 20 నుండి పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.