యాక్షన్ ఎలిమెంట్స్ తో గుజ్ బమ్స్ పుట్టిస్తున్న కాజల్ అగర్వాల్.. ట్రైలర్ ఎలా ఉందంటే..?
ఈ క్రమంలో ప్రమోషన్స్ హడావిడి మరింత పెరిగింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 38 సెకండ్ల విడివి కలిగి ఉంది. డాక్టర్ అయినటువంటి ఓ అమ్మాయిని గుర్తు తెలియని వ్యక్తి చంపడానికి ప్రయత్నించడం.. ఆమెను కాపాడే క్రమంలో సత్య చేతిలో ఆ అమ్మాయి ప్రాణం పోవడం. దీంతో సత్య ఉద్యోగం పోవడం జరిగాయి. అసలు ఆ అమ్మాయిని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అనే విషయాలను జాజ్ లేకపోయినా దర్యాప్తు చేసి అంతకుడిని పట్టుకోవడానికి సత్య ఎలా పోరాడింది... అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటివరకు గ్లామర్ తో మెప్పించిన కాజల్ ఇప్పుడు విజయశాంతి లాగా యాక్షన్ మూడ్లోకి దిగింది. ట్రైలర్ అయితే మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. మరి సినిమా ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా కనుక బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయితే ఇక నుంచి కాజల్ అగర్వాల్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ బ్యూటీకి ప్రజెంట్ హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. పెళ్లయి పిల్లలు కూడా ఉండడంతో ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో కాజల్ అగర్వాల్ కూడా రేడియోరియంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది.