కీర్తి సురేష్ "రఘు తాత" మూవీ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు , తమిళ సినీ పరిశ్రమలలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నేను శైలజ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల క్రితం మహానటి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.
 

ఈ సినిమాలో ఈమె మహానటి సావిత్రి పాత్రను పోషించింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడడంతో ఈ సినిమా తర్వాత కీర్తి కి వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈమె అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలో నటించిన ఏ సినిమా కూడా మహానటి స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన కొత్త సినిమా విడుదల తేదీ వచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ "రఘు తాత" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... హాంబులే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కరగందర్ ఈ సినిమాకు నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ అవుతుంది. ఇకపోతే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks

సంబంధిత వార్తలు: