కీర్తి సురేష్ కి ఏమైనా పిచ్చా.. ఇలాంటి పనిచేస్తుందేంటి?
అయితే పుష్ప లాంటి సినిమా విడుదలవుతుంది అంటే చాలు చిన్న సినిమాలు అన్నీ కూడా తమ విడుదల ను వాయిదా వేసుకుంటాయ్. ఎందుకంటే పుష్పాలాంటి డైనోసార్ మూవీకి ఎదురెళ్లి ఇక బరిలో నిలవాలని అస్సలు అనుకోవు. కానీ కీర్తి సురేష్ మాత్రం ఇప్పుడు పుష్ప సినిమా ఢీకొట్టేందుకు రెడీ అయింది. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు. కీర్తి సురేష్ కి ఏమైనా పిచ్చా.. పుష్పా సినిమాకి పోటీగా తన సినిమాను విడుదల చేయడమేంటి అని అనుకుంటున్నారు అభిమానులు.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ రఘు తాతా సినిమాను.. ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తామని ఆ సినిమా మేకర్స్ ప్రకటించారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హోం బలే ఫిలిం బ్యానర్ పై ఖీర్ కందూర్ నిర్మిస్తున్నారు. అంతా బాగానే ఉన్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదలవుతుండగా.. తమ విడుదలను వాయిదా వేసుకోకుండా అదే రోజు కీర్తి సురేష్ సినిమా విడుదల చేసేందుకు రెడీ అవ్వడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.