ట్రైలర్: మనమే ట్రైలర్ తో హిట్టు కొట్టేలా ఉన్న కృతి.. శర్వానంద్..!
తాజాగా విడుదలైన మనమే సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ మొత్తం ఒక చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవడానికి శర్వానంద్ శెట్టి పడే కష్టాలను ఇందులో చాలా కామెడీగా చూపించారు.. ముఖ్యంగా వీరిద్దరి లైఫ్ లోకి ఆ పిల్లాడు ఎలా వచ్చాడు అసలు ఆ పిల్లోడు ఎవరు అనే విషయం తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ అయితే వైరల్ గా మారుతోంది. చాలా గ్యాప్ తర్వాత శర్వానంద్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ట్రైలర్ చూస్తూ ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించింది మరి ఈ సినిమాతో కృతి , శర్వా ఇద్దరూ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి.
2022లో వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా తర్వాత మరియు సినిమాలో కూడా నటించలేదు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత మనమే అనే సినిమాతో రాబోతున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టికి ఈ సినిమా విజయాన్ని అందించి తెలుగులో మరొక సారి టాలీవుడ్ లో సినిమా అవకాశాలను అందిస్తుందేమో చూడాలి మరి. దీంతో కృతి శెట్టి ఈమధ్య తెలుగు ఇండస్ట్రీని వదిలి కోలీవుడ్ వైపుగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది అక్కడ కూడా స్టార్ హీరోలతో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.