ఆ కాంబోలో అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా... సత్యరాజ్..!

MADDIBOINA AJAY KUMAR
తమిళ నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో తమిళ సినిమాలలో హీ రోగా నటించి మంచి గుర్తింపును కోలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు . ఇకపోతే ఈయన ప్రభాస్ హీరో గా రూపొందిన మిర్చి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఈయన బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర లో నటించాడు . ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది .

బాహుబలి విజయం తర్వాత ఈయన కు ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ లభించడంతో సత్యరాజ్ కు అనేక భాషల సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ఈయన కూడా అనేక భాషల సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈయన మోడీ జీవిత కథ ఆధారంగా రూపొందబోయే సినిమాలో మోడీ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ నన్ను మోడీ పాత్ర గురించి ఎవరు సంప్రదించలేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే రాజమౌళి , మహేష్ కాంబో లో మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసింది.

ఈ మూవీ లో కూడా ఈయన కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై సత్యరాజ్ స్పందిస్తూ నన్ను రాజమౌళి , మహేష్ కాంబో మూవీ లో పాత్ర గురించి ఎవరు సంప్రదించలేదు. కాకపోతే ఆ సినిమాలో ఆఫర్ వస్తే మాత్రం కచ్చితంగా చేస్తాను అని చెప్పాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమాలో నటించడం తోనే ప్రపంచానికి పరిచయమయ్యాను అని కూడా ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: