చాలా మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే చాలా తక్కువ కాలంలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకు మించిన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి.
అందులో భాగంగా ఈమె నటించిన మొదటి మూడు సినిమాలు మంచి విజయాలను అందుకున్న ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈమె తాజాగా శర్వానంద్ హీరో గా రూపొందిన మనమే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ జూన్ 7 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే మనమే సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా తనకు ఎలాంటి తరహా పాత్రలు చేయాలి అని ఉంది అనే విషయాలను చెప్పకొచ్చింది.
తాజాగా కృతి శెట్టి మాట్లాడుతూ ... బాహుబలి మూవీ లో అనుష్క తరహా పాత్రలో నటించాలని ఉంది అని , అలాంటి పాత్ర నా డ్రీమ్ రోల్ అని కృతి తాజాగా చెప్పుకొచ్చింది. అలాగే యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేయాలని ఉంది కూడా ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించింది. అలాగే సినిమా హిట్ , ఫ్లాప్ గురించి నేను ఏ మాత్రం పట్టించుకోను అని , కాకపోతే సినిమా కోసం మాత్రం ఎంత వరకైనా వెళతాను అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది.