"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" కి మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ తాజాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నిన్న అనగా 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు కాస్త నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకి విడుదల అయిన మొదటి రోజు భారీ కలెక్షన్ లు దక్కాయి. మరి ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 1.10 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 76 లక్షలు , ఉత్తరాంధ్ర లో 46 లక్షలు , ఈస్ట్ లో 28 లక్షలు. వెస్ట్ లో 24 లక్షలు , గుంటూరు లో 30 లక్షలు , కృష్ణ లో 20 లక్షలు , నెల్లూరు లో 17 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.51 కోట్ల షేర్ ... 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొదటి రోజు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 70 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.46 కోట్ల షేర్  , 8 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా మరో 6.54 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs

సంబంధిత వార్తలు: