సినిమాలకు ముందు సంపూర్ణేష్ బాబు ఆ పని చేసేవాడా..!!
అలా సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ బయట నరసింహ చారీని చూసిన స్టీవెన్ శంకర్ అలియాస్ బేబి దర్శకుడు సాయి రాజేష్.. సంపూతో సినిమా చేయాలని, తను రాసుకున్న కథకు హీరోగా సంపూ సరిగ్గా సరిపోతాడని భావించి.. నరసింహా చారీని సంపూర్ణేష్ బాబుగా తీర్చి దిద్ది హృదయకాలేయం సినిమా చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం వస్తే చాలనుకున్న సంపూకు ఏకంగా హీరో చాన్స్ రావడంతో ఆయన సంతోషం అంతా ఇంతా కాదు. కట్ చేస్తే.. హృదయకాలేయం హిట్టయి సంపూకు ఓ రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత సింగం 123, కొబ్బరి మట్ట, కాలీ ఫ్లవర్ ఇలా కామెడీ సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. చివరగా తమిళ బ్లాక్ బస్టర్ మండేలా రీమేక్ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో కనిపించాడు. ఇక సంపూ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 20 నుంచి 30 లక్షల వరకు రెమ్యునరేసన్ తీసుకుంటున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఇక తన ఆస్తుల విషయానికొస్తే.. సినిమాల్లో, తన వృత్తి పరంగా కూడబెట్టంది రూ.5 కోట్ల వరకు ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక సంపూ.. చాలా మందికి ట్రోల్ మెటీరియల్ అయినా కానీ.. సాయం అంటే మాత్రం ఎప్పుడు ముందుంటాడు. ఒకరికి కష్టం వచ్చిందని తెలిస్తే చాలు, తన వంతు సహాయం ఖచ్చితంగా చేస్తుంటాడు.