షాక్: మద్యం మత్తులో రచ్చ చేసిన రవినా టాండన్.. వీడియో వైరల్..!

Divya
కే జి ఎఫ్-2 చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే నిన్నటి రోజున ఈమె ప్రయాణిస్తున్న కారు ముగ్గురు మహిళలను ఢీ కొట్టినట్లుగా సమాచారం.. వీరికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది.అందుకు బదులుగా రవినా కారును ఆపి వారి పైన దాడి చేసినట్లుగా కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే ఈ వీడియోలో రవినా టాండన్ బాధితులతో ఏదో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే అందుతున్న సమాచారం మేరకు రవినా టాండన్ కారుతో యాక్సిడెంట్  చేసిన  మహిళలను బయటికి వచ్చి మరి వారిపైన దాడి చేసిందని అక్కడ ఉన్న స్థానికులు సైతం తెలియజేస్తున్నారు.. తన పేరు మహమ్మద్ తాను బాంద్రా నివాసిని అని తన అమ్మ చెల్లి తదితరులతో కలిసి బయటికి వెళుతున్నాము అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా నటి రవినా టాండన్ కారు  మా అమ్మను ఢీ కొట్టిందని తెలిపారు. దీంతో ఆమె ముక్కు తలకు తీవ్ర గాయాలయ్యాయి ఆ తర్వాత  రవీనా టాండన్ కారు డ్రైవర్ మా అమ్మను కొట్టారని..

ఆ వెంటనే మద్యం మత్తులో ఉన్న రవినా కూడా బయటికి వచ్చి తన తల్లి పైన దాడి చేసినట్లుగా తెలియజేశారు. ఈమె పైన ఫిర్యాదు చేయడానికి నాలుగు గంటల నుంచి పోలీస్ స్టేషన్ బయట నిలుచున్నామని అయితే ఎవరు వినిపించుకోవడంలేదని కేవలం రాజీ అంటూ చెబుతున్నారు అంటూ బాధితులు తెలియజేస్తున్నారు. తనకు సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అని మహమ్మద్ ఈ వీడియోలో తెలియజేశారు. అలాగే రవీనా టాండన్ చుట్టూ చాలామంది గూమికూడి ఉన్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. అలాగే రవినా పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించడంతో ఆమె దయచేసి తనని కొట్టవద్దు అంటూ అక్కడున్న వారిని వేడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: