అక్షయ్ కుమార్.. ఓ పెద్ద ఫ్లాప్ హీరో అంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీ..!!
అక్షయ్ కు మొదట షాకిచ్చిన మూవీ సామ్రాట్ పృథ్వీరాజ్. ఈ సినిమా ఏకంగా రూ.170 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. ఇక ఈ ఏడాది వచ్చిన బడే మియా చోటే మియా మూవీ అయితే రూ.260 కోట్ల నష్టాలను మిగిల్చింది. ఇవే కాకుండా గత ఐదేళ్లలో సెల్ఫీ, రామ్ సేతు, జోకర్, జానీ దుష్మన్, అఫ్లటూన్ లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.ఇన్ని ఫ్లాపులు, ఇంత భారీ నష్టాలు వచ్చినా.. అక్షయ్ కుమార్ ఇప్పటికీ బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే అతిపెద్ద హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. అతని కెరీర్లో భారీ ఫ్లాపులు ఉన్నట్లే హిట్స్ కూడా ఉన్నాయి. గత మూడు దశాబ్దాల్లో అక్షయ్ నటించిన హిట్ సినిమాలు ఏకంగా రూ.7 వేల కోట్ల లాభాలు తెచ్చిపెట్టాయి. గతేడాది అతడు నటించిన ఓఎంజీ 2 మూవీ కూడా రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది.ఇప్పుడు కూడా అక్షయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సింగం అగైన్, వెల్కమ్, జంగిల్, స్కైఫోర్స్, సర్ఫిరాలాంటి సినిమాలు ప్రస్తుతం అక్షయ్ చేస్తున్నాడు. ఇవే కాకుండా హేరా ఫేరి 3, జాలీ ఎల్ఎల్బీ 3లాంటి సీక్వెల్స్ లోనూ నటిస్తున్నాడు. ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులోనూ కన్నప్ప మూవీలో అక్షయ్ అతిథి పాత్ర పోషిస్తున్నాడు. తెలుగులో అతనికి ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ మధ్యే హైదరాబాద్ వచ్చి తన షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.