3 రోజుల్లో "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ కి 3 రోజుల్లో నైజాం ఏరియాలో 2.47 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.28 కోట్లు ,ఉత్తరాంధ్ర లో 79 లక్షలు , ఈస్ట్ లో 52 లక్షలు , వెస్ట్ లో 42 లక్షలు , గుంటూరు లో 46 లక్షలు , కృష్ణ లో 39 లక్షలు , నెల్లూరు లో 28 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.60 కోట్ల షేర్ ... 11.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 3 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 95 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల షేర్ , 14.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా మరో 3 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.