అల్లరి నరేష్ "బచ్చల మల్లి" కి సూపర్ స్పీడ్ బిజినెస్..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. నరేష్ కొంత కాలం క్రితం ఉగ్రం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన అల్లరి నరేష్ తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ ద్వారా ఆయనకు అపజయం వచ్చింది. ఈ సినిమా తర్వాత నరేష్ "ఒకటి అడక్కు" అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

నరేష్ చాలా సంవత్సరాల తర్వాత నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం నరేష్ కి నిరాశనే మిగిల్చింది. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ "బచ్చల మల్లి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా , ఇందులో నరేష్ అదిరిపోయే పవర్ఫుల్ లుక్ లో ఉన్నాడు.

ఈ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ స్పీడ్ గా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యుఎస్ హక్కులు కూడా అమ్ముడుపోయినట్లు సమాచారం. కల్కి మరియు పుష్ప 2 మూవీలను యూఎస్ ప్రాంతం లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిర సినిమాస్ ఈ చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇలా చిత్రీకరణ దశలో ఉండగానే ఈ మూవీ కి భారీ డీల్స్ వస్తుండడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ జనాల్లో పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: