"కల్కి" ఫస్ట్ ప్రీమియర్ షోలు పడేది అక్కడే..!

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి సినిమాని జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ భారీ ఎత్తున ప్రచారాలను కూడా చేస్తున్నారు. మొదటి నుండే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడం , ఆ అంచనాలకు తగినట్టుగా డిఫరెంట్ గా ఈ సినిమా యొక్క ప్రచారాలను మేకర్స్ చేస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి.
 

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ప్రీమియర్ షో ల వివరాలను అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ప్రీమియర్ షో స్ నార్త్ అమెరికాలో జూన్ 26 వ తేదీన పడనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన మరిన్ని వివరాలను డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు.  2:30 PM EST , 1:30 PM CST ,  12:30 PM MST ,  11:30 AM PST. ఈ టైమింగ్స్ లో సినిమా ప్రీమియర్ షో లను ప్రదర్శించబోతున్నారు. ఇలా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ఫస్ట్ ప్రీమియర్ షో లకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులు అయినటువంటి దీపికా పదుకొనే , దిశా పటానీ హీరోయిన్ లుగా కనిపించనుండగా , హిందీ సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమితా బచ్చన్ ఈ మూవీబ్లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుండగా ... నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ ,  స్వప్న సినిమాస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: