స్కిన్ ఎలర్జీ తో బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్..!!
సోషల్ మీడియాలో తనదైన ఫ్యాషన్ స్టైలీష్ దుస్తులతో నిత్యం అందరినీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎప్పుడు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించి నెట్టింట సంచలనంగా మారే ఉర్ఫీ ఇప్పుడు తన అనారోగ్య సమస్యను చెప్పుకొచ్చింది. బొటాక్స్, ఫిల్లర్స్ గురించి తెలిపింది. 18 ఏళ్ల వయసు నుంచి తాను ఫిల్లర్లు పొందుతున్నానని.. తీవ్రమైన అలెర్జీల కారణంగా తన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని అన్నారు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఇమ్యునోథెరపీ తీసుకుంటున్నట్లు వెల్లడించింది.చర్మ అలెర్జీల కారణంగా తాను ఎంతో బాధపడుతున్నట్లు తెలిపింది. అలెర్జీ వల్ల తన ముఖం చాలాసార్లు ఉబ్బిపోతుందని.. నిద్రలేచేసరికి తన ముఖం వాచి పోతుందని.. దీనివల్ల ఎప్పుడూ అసౌకర్యంగా ఉంటానని అన్నాడు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఇమ్యునోథెరపీ జరుగుతుందని.. 18 ఏళ్ల వయసు నుంచి సాధారణ ఫిల్లర్లు, బొటాక్స్ కారణంగా తనకు ఎలాంటి సమస్య రాలేదని తెలిపింది. తన ముఖం వాచినట్లు కనిపిస్తే ఎలాంటి సలహాలు ఇవ్వద్దని తెలిపింది. ప్రస్తుతం ఉర్ఫీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఉర్ఫీ ఫోటోస్ చూసి ఆందోళన చెందుతున్నారు ఫ్యాన్స్.