బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న రణబీర్ కపూర్ అలియా భట్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరు కూడా బాలీవుడ్ లో స్టార్స్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు వరుస సినిమాలు చేస్తుంది బిజీగా ఉన్నారు. అయితే ఈ జంట అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం ఇటలీ వెళ్లారు. ఇటీవల మళ్ళీ అక్కడ నుండి తిరిగి వచ్చారు. అయితే తాజాగా ఇప్పుడు ఇటలీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ జంట ఒక లగ్జరీ కారు కొన్నట్లుగా సమాచారం వినబడుతోంది. లెక్సస్ ఎల్ ఎం కారును అలియా
భట్ దంపతులు కొన్నారట. రణబీర్ కపూర్ అలియా భట్ ఇటీవల ఇండియాకి వచ్చారు. ముంబై విమానాశ్రమంలో సందడి చేశారు. అయితే ఈసారి వాళ్ళని అక్కడి నుండి తీసుకు వెళ్ళడానికి ఎంపీ వివాహం వచ్చింది. ఎంపీవి అంటే మల్టీపర్పస్ వెహికల్ అన్నమాట. ఇక ఈ ఈ కారులో బోలెడన్ని ఫీచర్స్ ఉంటాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కారును పిల్లలతో కలిసి డ్రైవింగ్ చేయడం కోసం ఆలియా భట్ దంపతులు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ కారులో ఏడు సీట్లు ఉంటాయి. చాలా
పెద్దగా విశాలంగా ఉంటుంది. ఇకపోతే ఇప్పటికే రణబీర్ దంపతుల దగ్గర అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ కారు కూడా చేరింది. అయితే ఇప్పుడు ఈ కారుకి సంబంధించిన ధర సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక దాదాపుగా ఈ కారణం 2.5 కోట్లు ఖర్చు చేసి కొన్నట్లుగా సమాచారం వినబడుతుంది... ఇదిలా ఉంటే వీళ్ళిద్దరూ ఈ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అటు రణబీర్ కపూర్ ఇటు ఆలియా భట్ ఇద్దరు కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రణబీర్ కపూర్ అలియా భట్ కాంబినేషన్లో రామాయణం సినిమా రావాల్సిందీ. కానీ వీళ్ళిద్దరూ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు..!