హిట్ టాక్ వచ్చిన కలెక్షన్లు రాబట్ట లేకపోతున్న "భజే వాయు వేగం"..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ తాజాగా భజే వాయు వేగం అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ టాక్ వచ్చింది. దానితో మొదటి రోజుతో పోలిస్తే ఈ మూవీ కి రెండవ రోజు కలెక్షన్లు భారీగా పెరిగినప్పటికీ ఈ మూవీ ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకోలేదు. మరి ఎలక్షన్స్ సీజన్ కావడమో , మారే కారణమో కానీ మంచి టాక్ వచ్చిన ఈ మూవీ భారీ కలక్షన్లను వసూలు చేయలేక పోతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా ఈ మూవీ కి ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.
నాలుగు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 2.35 కోట్ల షేర్ , 4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక నాలుగు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 38 లక్షల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 2.73 కోట్ల షేర్ ... 5.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు 3.60 ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , 4 కోట్ల టార్గెట్ టి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 1.27 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: