యావరేజ్ టాక్ తో సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"..!
ఈ మూవీ కి 4 రోజుల్లో నైజాం ఏరియాలో 2.77 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.42 కోట్లు ,ఉత్తరాంధ్ర లో 86 లక్షలు , ఈస్ట్ లో 57 లక్షలు , వెస్ట్ లో 45 లక్షలు , గుంటూరు లో 51 లక్షలు , కృష్ణ లో 44 లక్షలు , నెల్లూరు లో 31 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.33 కోట్ల షేర్ ... 12.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 4 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 52 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.02 కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 8.87 కోట్ల షేర్ , 16.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా మరో 2.13 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.