బాలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు అయినటు వంటి
అజయ్ దేవగన్ కొంత కాలం క్రితం మైదాన్ అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ
మూవీ లో
ప్రియమణి ఓ కీలకమైన పాత్రలో నటించగా ,
బోనీ కపూర్ ఈ
మూవీ ని నిర్మించాడు . ఈ
మూవీ చాలా రోజుల నుండి షూటింగ్ జరుపుకొని కొంత కాలం క్రితమే మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుద ల అయింది.
ఇకపోతే విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలే వచ్చినప్పటికీ ఎందుకో
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ
మూవీ భారీ మొత్తంలో కలక్షన్ లను వసూలు చేయడంలో విఫలం అయింది. ఇకపోతే
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్న భారీ కలెక్షన్ లను వసూలు చేయలేకపోయిన ఈ
సినిమా కొన్ని రోజుల క్రితమే
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది.
ఇకపోతే తాజాగా
అమెజాన్ సంస్థ వారు ఈ సినిమాను రెంటల్ పద్ధతిలో కాకుండా ఫ్రీ గానే అందుబాటు లోకి తీసుకువచ్చారు. ఇకపోతే ఈ
మూవీ ని కేవలం
హిందీ లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ
మూవీ ని ఇతర భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారేమో చూడాలి.
అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాకు రహమాన్ అదిరిపోయే రేంజ్ సంగీతాన్ని అందించాడు. ఈ
మూవీ సంగీతానికి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.