రిలీజ్ కి ముందే రికార్డు క్రియేట్ చేస్తున్న పుష్ప కపుల్స్..!!
అనుకున్నట్లుగానే ఆ స్టెప్‌ను లక్ష మంది రీల్స్ చేసేశారు. 'పుష్ప: ది రైజ్' సినిమాలోని సమంత ఐటెమ్ సాంగ్‌ను గణేశ్ ఆచార్యనే కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు కూడా రెండో 'పుష్ప'లో ఆయనే ఐటెమ్ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తారట. మరి అందులో ఎవరు డ్యాన్స్ చేస్తారో చూడాలి. ఇప్పటికే చాలామంది కథానాయికల పేర్లు వినిపించినా ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు.ఎప్పుడూ ఒకేరకమైన రికార్డులు సెట్ చేస్తుంటే ఏం బావుంటుంది. అప్పుడప్పుడూ కొత్తగా చేయాలి. పక్కనోళ్లు మనల్ని చూసి ఫాలో అయ్యేలాగా చేయాలి. అప్పుడు కదా మజా వచ్చేది అని అంటోంది పుష్ప కపుల్. వాళ్ల ఆలోచనలకీ, ఇష్టాలకీ తగ్గట్టే నెట్టింట్లో సరికొత్తగా హల్ చల్ అవుతున్నారు. ఇంతకీ పుష్ప కపుల్ చేస్తున్న సందడేంటి?
పుష్ప పుష్ప పుష్ప పుష్ప అంటూ... పుష్పరాజ్ మేనియా మరింత జోరందుకుంది. ఒక్కడే కష్టపడితే ఏం బావుంటుంది... వెంట నేనూ ఉంటా అంటూ కపుల్ సాంగ్‌తో గ్రౌండ్లోకి దిగేశారు రష్మిక మందన్న.అసలే సామి సామి అంటూ ఫస్ట్ పార్టులో ఆమె చేసిన సందడి చూసిన జనాలు... ఇప్పుడు సెకండ్ పార్టులో వీళ్ల కెమిస్ట్రీకి ఫిదా అయిపోతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన సూసేకీ సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. వెరీ ఫస్ట్ ప్లేతోనే జనాలను అట్రాక్ట్ చేసేసింది సూసేకీ.మరో సామి సామి గ్యారంటీ అని అప్పుడే చెప్పుకున్నారు జనాలు. అన్నట్టుగానే సూసేకీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. సింపుల్ స్టెప్పులను ట్రై చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఔత్సాహికులు. ఇప్పటికే దాదాపు లక్ష రీళ్లకు పైగా క్రియేట్ అయ్యాయట సూసేకీ సాంగ్‌కి.ఈ విషయాన్నే షేర్ చేసింది పుష్ప టీమ్. ఆగస్టు 15న రిలీజ్‌కి రెడీ అవుతోంది ఈసినిమా. అంతలోపు ఇలాంటి రికార్డులను మరెన్నిటికీ క్రియేట్ చేస్తుందో, ఇంకెన్నిటిని బ్రేక్ చేస్తుందో... చూడాల్సిందేనని అంటోంది అల్లు ఆర్మీ.