కింగ్, మన్మథుడు.. ఏదైనా నాగార్జునకే వర్తిస్తాయి. ఈ ఏజ్‌లోనే మన్మథుడిగానే ఉన్నాడు నాగ్. రాత్రి సమయంలో కచ్చితంగా ఫాలో అయ్యే రహస్యాలు బయటపెట్టాడు.నాగార్జున అంటే ఫిట్నెస్కి కేరాఫ్. ఆయన ఫుడ్, డైట్ విషయంలో చాలా కేర్‌గా ఉంటారని అంతా అనుకుంటారు. ఆరు పదుల్లోకి దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఇంకా ముప్పై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు నాగ్. ఆయన ఫిజిక్ మాత్రమే కాదు, ఆయన మాటలు, ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి. ఆయన ఇప్పుడు లవ్ స్టోరీస్ చేసినా ఆకట్టుకుంటున్నారు. అలరిస్తున్నారు.ఇదిలా ఉంటే నాగార్జున ఫిట్ నెస్ గురించి చాలా విషయాలు చెప్పారు. ఆయన మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటారు, జ్యూసులు, ఫుడ్ తీసుకునే టైమింగ్స్ కూడా వెళ్లడించారు. త్వరగా ఫుడ్ తీసుకుంటానని కూడా తెలిపారు నాగార్జున. అనేక ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో నాగ్ ఓ క్రేజీ రహస్యాలను వెల్లడించారు.ఇటీవల ప్రతి రోజూ ఆయన చేసే పనులు చెప్పారు. తీసుకునే ఫుడ్ మాత్రమే కాదు, ఆల్కహాల్ కూడా తీసుకుంటాడట. రోజూ రెండు రౌండ్లు వేస్తాడట. నా సామి రంగం టైమ్‌లో కీరవాణి, చంద్రబోస్‌లతో చేసిన చిట్‌చాట్‌లో ఈ విషయాలను తెలిపారు నాగ్. అన్ని రకాలు ఫుడ్ తీసుకుంటానని, పప్పు, రెండు మూడు రకాలు కూరగాయలు, నాన్ వెబ్, మటన్, చికెన్, ఫిష్ ఇలా అన్నీ తింటానని చెప్పాడు నాగ్. అన్నీ కడుపునిండా తింటాడట.
అదే సమయంలో సాయంత్రం ఎర్లీగా ఫుడ్ తీసుకుంటాడట. ఏడు గంటల లోపే తాను తినాల్సింది తినేస్తాడట. అదే సమయంలో వైట్ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్ తింటాడట నాగ్. దీంతోపాటు రోజూ రెండు రౌండ్లు మందేస్తానని కూడా చెప్పారు. అంతేకాదు రాత్రి సమయంలో మాత్రం ఒక్కటి మాత్రం కచ్చితంగా చేస్తాడట. రాత్రిళ్లు పడుకునే సమయంలో కచ్చితంగా ఆయన స్వీట్ తింటాడట. స్వీట్ తినడం తన అలవాటు, స్వీట్ తినకుంటే తనకు నిద్ర పట్టదని, కచ్చితంగా స్వీట్ తినాల్సిందే అన్నారు. ప్రతి రోజూ ఇది ఫాలో అవుతాడట నాగ్. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది.నాగార్జున చాలా రోజుల తర్వాత ఈ ఏడాది నా సామి రంగ`తో హిట్ కొట్టాడు. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ వైపు టర్న్ తీసుకున్నాడు. ప్రస్తుతం `కుబేర`లో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్‌తోనూ కలిసి నటిస్తున్నాడట. `కూలీ`లో నాగ్ కూడా ఉంటారని సమాచారం. మరోవైప తనకు `నాసామిరంగం వంటి సక్సెస్ ఇచ్చిన దర్శకుడితోనే మరో సినిమా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి దాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు నాగ్.