మే 13 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఆ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నిన్న అనగా జూన్ 4 వ తేదీన విడుదల అయ్యాయి. నిన్న విడుదల అయిన ఫలితాలలో తెలుగు దేశం పార్టీ కి భారీ మొత్తంలో సీట్లు దక్కాయి. అలాగే జనసేన , బి జె పి కి కూడా బాగానే సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి.
ఇకపోతే తెలుగు దేశం పార్టీ కి సొంత గానే భారీ సీట్లు రావడంతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రి కాబోతున్నాడు. ఇకపోతే చంద్రబాబు నాయుడు జూన్ 9 వ తేదీన అమరావతి లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఈవెంట్ కు ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు అనేక మంది జాతీయ నాయకులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ ప్రమాణ స్వీకార వేడుకను ఎంతో అట్టహాసంగా నిర్వహించాలి అని టి డి పి శ్రేణులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా ఎందుకు సంబంధించిన ఈవెంట్ బాధ్యతలను టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను కు అప్పగించినట్లు తెలుస్తోంది. దానితో బోయపాటి శ్రీను , చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించడానికి కావలసిన అన్ని పనులను ఇప్పటికే మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈయన ఈ ప్రమాణ స్వీకారానికి చాలా తక్కువ సమయం ఉండడంతో అందుకు సంబంధించిన పనులను చాలా స్పీడ్ గా పూర్తి చేయాలి అని కూడా బోయపాటి డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.