తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
దళపతి విజయ్ కొన్ని సంవత్సరాల క్రితం ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన తుపాకీ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్
బ్యూటిఫుల్ నటీమణి
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా , ఈ సినిమాకి హరిజ్ జయరాజ్ సినిమాకు సంగీతం అందించాడు.
ఇకపోతే ఈ
మూవీ మంచి అంచనాల నడుమ 2012 వ సంవత్సరం
తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా విడుదల అయింది. ఈ
మూవీ కి
తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా
బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ
మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాతోనే తెలుగు లో
విజయ్ కి మంచి గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించే
బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించిన తుపాకీ
మూవీ ని తిరిగి మళ్ళీ
థియేటర్ లలో చేయబోతున్నారు.
తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
మూవీ ని
జూన్ 21 వ తేదీన భారీ ఎత్తున
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ
పోస్టర్ వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం
విజయ్ హీరోగా రూపొందిన గిల్లి
మూవీ ని రీ రిలీజ్ చేయగా అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్ లను ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. మరి
విజయ్ నటించిన తుపాకీ
మూవీ రీ రిలీస్ లో భాగంగా ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో ,
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.