అఫిషియల్ : "తమ్ముడు" రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల క్రితం తమ్ముడు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రీతి జింగానియా పవన్ కి జోడిగా నటించింది. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ని శివరామకృష్ణ నిర్మించారు. రమణ గోగుల సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ 1999 వ సంవత్సరం థియేటర్లలో విడుదల అయింది. 


ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. చివరగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ ద్వారా పవన్ కి కూడా అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.


ఈ మూవీ ని జూన్ 15 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన చాలా సినిమాలు థియేటర్ లలో రీ రిలీజ్ అయ్యి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి తమ్ముడు మూవీ రీ రిలీజ్ కోసం కూడా పవన్ అభిమానులు ఎప్పటి నుండో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: