క్లీన్ హిట్ కి అతి దగ్గరలో "భజే వాయు వేగం"..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న కార్తికేయ తాజాగా భజే వాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 31 వ తేదీన థియేటర్లో విడుదల అయింది. ఇక ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.
5 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.15 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.38 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 2.53 కోట్ల షేర్ , 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 5 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 42 లక్షల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 2.95 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఈ సినిమాకు 3.60 ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , 4 కోట్ల టార్గెట్ టి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 1.05 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఇకపోతే పోయిన సంవత్సరం బెదురులంక 2012 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న కార్తికేయ హీరో గా రూపొందిన భజే వాయు వేగం సినిమాకి ప్రస్తుతం మంచి కలెక్షన్ లు వస్తున్నాయి. దీనితో ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: