తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే పవన్ కళ్యాణ్ "జనసేన" అనే పార్టీని స్థాపించారు. 2019 వ సంవత్సరం జనసేన పార్టీ ఎలక్షన్ లలో పోటీ చేసింది. కానీ ఆ సారి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది. ఈ పార్టీ నుండి కేవలం ఒకే ఒక్క వ్యక్తి గెలిచి అసెంబ్లీ కి వెళ్లారు. ఇక పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే రెండిట్లో కూడా ఓడిపోయాడు. ఇక ఈ సారి జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగు దేశం , బి జె పి తో పొత్తులో భాగంగా పోటీలోకి దిగింది.
అందులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ , 2 పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది. ఇక తక్కువ స్థానాల లోనే జనసేన అభ్యర్థులు పోటీలోకి దిగిన అన్ని స్థానాలలో కూడా గెలవాలి అని పవన్ మొదటి నుండే ప్లాన్ చేసుకున్నాడు. అలాగే జరిగింది. ఈ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ , 2 పార్లమెంటు స్థానాలలో గెలుపొంది 100% విక్టరీ నీ సాధించింది. ఇకపోతే గెలుపు అనంతరం పవన్ కళ్యాణ్ ఢిల్లీ కి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కలిశారు.
ఇక ఢిల్లీ లో నరేంద్ర మోడీ ని కలిసిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ మరియు తన కుమారుడు అకీరా , భార్య అన్నా లేజినోవా తో కలిసి నేరుగా చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనా దేవి ఆశీర్వాదం కోసం నేరుగా ఎయిర్ పార్ట్ నుండి చిరంజీవి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గెలవడం , అతని పార్టీ సభ్యులు అందరూ గెలవడంతో మెగా కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.