వీడియో పెట్టు.. ఆఫర్ పట్టు.. అంటున్న అర్జీవి..!!
ప్రస్తుతం ఫిల్మ్ ఇన్స్టి్ట్యూట్ లు అన్నీ ఔట్ డేటెడ్ గా మారాయని అన్నారు వర్మ. డైరెక్టర్, రైటర్, మ్యూజిక్ కంపోజర్ ఇలా ఎందులో ఆసక్తి ఉన్నా సరే తమ డెన్ ఆహ్వానం పలుకుతుందన్నారు. అందుకు కావాల్సిన ప్రశ్నలకు తన వెబ్ సైట్ లో ఉంచాడు. ఇప్పటివరకు కొంతమంది సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 319 మంది డైరెక్టర్స్, 50 మంది మ్యూజిక్ కంపోజర్స్ తమ వెబ్ ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు.అయితే వీరిలో ఒక్కో విభాగం నుంచి 10 మందిని సెలక్ట్ చేయనున్నట్లు తెలిపారు. వీరికి సంబంధించిన లిస్ట్ ను జూన్ 9న రిలీజ్ చేస్తామని అన్నారు.
డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రమే కాదు.. నటీనటులకు కూడా ఛాన్స్ ఉందన్నారు. ఇందుకు వారి ఫోటోస్ మాత్రమే పంపమని చెబుతూ పొరపాటు చేశామని అన్నారు. వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయని.. ఫోటోలుక్స్ వల్ల సెలక్ట్ చేయడం కాస్త కష్టంగా మారిందని అన్నారు. కాబట్టి డైలాగ్ ఆడిషన్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. డైలాగ్ వీడియో రూపంలో క్రియేట్ చేసి జూన్ 20లోపు అప్లోడ్ చేయాలని అన్నారు. అలాగే కెమెరామెన్స్ గా రాణించాలనుకునేవారు కూడా జూన్ 20 లోపు అప్లై చేసుకోవాలని అన్నారు. గతంలో ఇచ్చిన నిబంధనలను మార్పులు చేసి మరోసారి 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.