ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గడంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్... లక్ష్మణ్..!

MADDIBOINA AJAY KUMAR
ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలకు బ్లాక్ బాస్టర్ సినిమాలకు ఫైట్ మాస్టర్ లుగా పని చేసి సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇకపోతే ఎప్పుడు అయిన జూనియర్స్ వచ్చారు అంటే వారు తమ కొత్త టాలెంట్ ను బయట పెట్టడంతో సీనియర్స్ కంటే కూడా జూనియర్స్ కు కాస్త అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

ఇది ఏ ఇండస్ట్రీ లో అయిన , ఏ క్రాఫ్ట్ లో అయినా సర్వ సాధారణంగా జరిగే విషయం. దానిని పెద్దగా పట్టించుకోకూడదు. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ ను బయట పెట్టాలి , అలాగే కొత్త టాలెంట్ ను ఎప్పుడు స్వాగతించాలి. ఇకపోతే తాజాగా రామ్ లక్ష్మణ్ మాస్టర్ లు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా వీరు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. తాజాగా రామ్ లక్ష్మణ్ మాస్టర్ లు ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కొత్త వారిని ప్రోత్సహిస్తూనే ఉంటుంది. కొత్తవారు రావడంతో మాకు అవకాశాలు తగ్గాయి అని మేము ఎప్పుడూ బాధపడం.

ఎందుకు అంటే మాకు సినిమా ఇండస్ట్రీ మేము ఆశించిన దాని కంటే ఎక్కువ ఇచ్చింది. అది మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. డబ్బు , పేరు , ప్రతిష్టలు అనేవి ఎండమాములతో సమానం. మనం ఎంత దూరం పరిగెత్తిన ఇంకాస్త దూరంలో అవి మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి వాటి గురించి మేము అసలు పట్టించుకోము. మేము ఎప్పుడు కష్టపడుతూ సినిమా ఇండస్ట్రీ కోసం పాటుపడుతూ ఉంటాం అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ ఇద్దరు ఫైట్ మాస్టర్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: