మల్టీస్టారర్ మూవీస్ పెద్ద వేస్ట్.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..!
ఇక ఇదిలా ఉంటే త్వరలో మహారాజు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.." మల్టీ స్టార్ మూవీస్ నేను చెయ్యాలి అనుకోవడం లేదు. ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి వాటితో నాకు కొన్ని మంచి మరియు చెడు అనుభవాలు ఉన్నాయి. ఒక ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించినప్పుడు ఎవరికీ ఎలాంటి పాత్ర వస్తుందో ముందే తెలుస్తుంది. అయితే ఆ పాత్రలో మనం ఎంత బాగా నటించినా కొన్నిసార్లు మనకు ఆశించిన ఫలితం రాకపోవచ్చు.
ఇద్దరూ స్టార్స్ ఓకే విధంగా కష్టపడితే ఎవరో ఒకరికి మాత్రమే పేరు లభిస్తుంది. మరొకరి కష్టాన్ని ఎవ్వరూ గుర్తించరు " అంటూ చెప్పుకొచ్చారు విజయ సేతుపతి. ప్రజెంట్ విజయ సేతుపతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిజానికి ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీలో ప్రతి సినిమాని మల్టీ స్టార్ కింద రూపొందిస్తున్నారు. గెస్ట్రోలను ఏదో ఒక పేరుతో మరొక హీరోని ఆ సినిమాలో ఎంటర్ చేస్తున్నారు. అలా చేయడం ద్వారా ముందు నుంచి ఎంతో కష్టపడి నటించినా హీరోకి పెద్దగా ఫలితం దక్కడం లేదు. ఇక ఈ తరహా లోనే విజయ్ సేతుపతి మల్టీ స్టార్లర్ సినిమాలను చేయను అంటూ గట్టి నిర్ణయం తీసుకున్నారు.