"అఖండ 2" ఓపెనింగ్ అక్కడే..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ కొంతకాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు కొన్ని అపజాయలను అందుకున్న బాలకృష్ణ ఈ సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ విడుదల అయిన కొన్ని రోజులకే ఈ సినిమా దర్శకుడు మరియు ఈ సినిమా హీరో అయినటువంటి బోయపాటి శ్రీను , బాలకృష్ణ ఇద్దరు కూడా ఈ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 ఉండబోతుంది అని ప్రకటించారు. దీనితో ఎప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా అని బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొన్ని రోజుల క్రితమే బోయపాటి శ్రీను ఈ సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయింది , ప్రస్తుతం బాలకృష్ణ గారు ఎలక్షన్ల హడా విడిలో బిజీగా ఉన్నారు. ఎలక్షన్లు పూర్తి అయ్యి , రిజల్ట్ రాగానే అఖండ 2 సినిమా ప్రారంభం అవుతుంది అని తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం ఎలక్షన్లు అయ్యాయి, రిజల్ట్ కూడా వచ్చింది. అందులో బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుండి మూడవ సారి గెలుపొందారు. ఇకపోతే ఎలక్షన్ హడా విడి అంతా ముగియడంతో అఖండ 2 సినిమాని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందిన హిందూపురంలో కానీ లేదా అమరావతి లో కానీ అఖండ 2 మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన అఖండ 2 పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: